తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాగార్జున చిత్రంలో రష్మీ గౌతమ్! - నాగార్జున చిత్రంలో రష్మీ గౌతమ్!

యాంకర్​గా నటిస్తూ వెండితెరపైనా రాణిస్తోంది రష్మీ గౌతమ్. తాజాగా నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో అవకాశం దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి.

nag, rashmi
నాగ్, రష్మి

By

Published : May 27, 2021, 2:26 PM IST

రష్మీ గౌతమ్‌.. బుల్లితెరపై యాంకర్‌గా వ్యవహరిస్తూనే సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఖతర్నాక్‌ కామెడీ షో 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌' (Extra jabardasth) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అలరిస్తుంటుంది. తాజాగా ఆమె నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే ఈ చిత్రం గోవాలో తన మొదటి షెడ్యూల్ షూటింగ్‌ జరుపుకొంది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ కూడా మొదలు కానుంది. ఇందులో కథానాయికగా కాజల్‌ అగర్వాల్ నటిస్తోంది. సినిమాను శ్రీవేంకటేశ్వర ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రష్మి గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు టాకీస్'లో తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆ పరిచయంతోనే ఆమెకు అవకాశం లభించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రష్మి హిందీ, తమిళ, కన్నడంలోనూ నటించింది.

ABOUT THE AUTHOR

...view details