'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల నాయిక రాశీఖన్నా. ఆ తర్వాత 'బెంగాల్ టైగర్', 'జై లవకుశ', 'వెంకీమామ', 'ప్రతిరోజూ పండగే' వంటి చిత్రాల్లో కథానాయికగా నటించి అలరించింది. తాజాగా నాగచైతన్య హీరోగా నటిస్తోన్న 'థ్యాంక్ యూ' చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశారనే వార్తలొస్తున్నాయి. త్వరలోనే రాశీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా! - రాశీఖన్నా
నాగచైతన్య నటిస్తున్న చిత్రం 'థ్యాంక్ యూ'లో అందాల నాయిక రాశీఖన్నా నటించనున్నారని సమాచారం. త్వరలోనే రాశీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా తర్వాత తెలుగులో రాశీ నటించనున్న మూవీ ఇదే కావడం విశేషం. గతంలో 'మనం' సినిమాలో నాగచైతన్య సరసన అతిథి పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య ముగ్గురు నాయికలతో రొమాన్స్ చేయనున్నారట. 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం తర్వాత తెలుగులో రాశీ నటించిన చిత్రాలు ఏవీ లేవు. ప్రస్తుతం ఆమె మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తోన్న 'పక్కా కమర్షియల్'లో నటించనుంది. తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటిస్తోంది. అయితే, 'ఊహలు గుసగుసలాడే' చిత్రం కంటే ముందే అక్కినేని కుటుంబ కథా చిత్రం 'మనం'లో నాగచైతన్య పక్కన అతిథి పాత్రలో కనిపించింది.
ఇదీ చదవండి:'మాస్టర్' దర్శకుడితో ప్రభాస్ చిత్రం!