తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాశీఖన్నాకు బంపర్ ఆఫర్.. ఆ రీమేక్​లో ఛాన్స్ - నితిన్ అంధాధున్ రీమేక్

మలయాళ అగ్రకథానాయకుడు పృథ్వీరాజ్ సరసన నటించే ఛాన్స్ రాశీఖన్నా కొట్టేసింది. వీరిద్దరూ 'అంధాధున్' రీమేక్​ కోసం కలిసి పనిచేయనున్నారు.

rashi khanna in malayalam andhadhun remake
రాశీఖన్నా

By

Published : Jan 24, 2021, 6:16 PM IST

ముద్దుగుమ్మ రాశీఖన్నా అదిరిపోయే అవకాశం దక్కించుకుంది. మలయాళ 'అంధాధున్' రీమేక్​లో హీరోయిన్​గా ఎంపికైంది. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తారు. రవి కె చంద్రన్ దర్శకత్వం వహిస్తారు. ఒరిజినల్​లో టబు పోషించిన పాత్రను ఇక్కడ మమత మోహన్​దాస్ పోషించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇదే సినిమాలో నితిన్, నభా నటేశ్, తమన్నా ప్రధాన పాత్రధారులుగా తెలుగులో తీస్తున్నారు. తమిళంలో ప్రశాంత్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్నారు.

ఇది చదవండి:'రైళ్లలో పాటలు పాడుతూ డబ్బు సంపాదించేవాడిని'

ABOUT THE AUTHOR

...view details