"ఓ చిత్రంతో నటిగా ఎంతటి విజయాన్ని అందుకున్నా.. ప్రతి సినిమాకూ అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తేనే పరిశ్రమలో నిలదొక్కుకోగలగుతాం" అని హీరోయిన్ రాశీఖన్నా అంటోంది. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగణ్‌తో 'రుద్ర' అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్‌కు ఎంపిక కావడానికి ముందు తను ఆడిషన్స్‌లో పాల్గొన్నట్లు తెలిపింది.
దానికి రోజులు చెల్లిపోతున్నాయి: రాశీఖన్నా - rashi khanna news
సీనియర్ నటిని అయినప్పటికీ, అజయ్ దేవ్‌గణ్ కొత్త సినిమా ఆడిషన్స్‌లో పాల్గొన్నానని రాశీఖన్నా చెప్పింది. స్టార్డమ్కు రోజులు చెల్లిపోతున్నాయని తెలిపింది.
రాశీఖన్నా
"స్టార్‌డమ్ అనే పదానికి రోజులు చెల్లిపోతున్నాయి. ఎంతటి సీనియర్ నటి అయినా.. ఎన్ని విజయాలు వెనకాలున్నా.. ప్రతిదీ తొలి చిత్రం అన్నట్లుగానే కష్టపడాల్సిందే. మనలోని నటిని ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిందే. అందుకే నేను సీనియర్ నటిని అయినా.. ఎలాంటి పట్టింపులు లేకుండా 'రుద్ర' ఆడిషన్స్‌లో పాల్గొని నిరూపించుకున్నాను" అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగులో నాగచైతన్యతో 'థ్యాంక్ యూ' సినిమా చేస్తోంది.
ఇవీ చదవండి: