తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రోల్​ రైడా 'నాగలి' సాంగ్​​కు భారీ స్పందన - రైతన్నకు ఆక్రోశం వస్తే ఇలానే ఉంటది

రైతు కష్టాలపై 'నాగలి' అనే వీడియో పాటను రూపొందించాడు ర్యాపర్​ రోల్​ రైడా. రైతన్నల పట్ల నేటి తరానికున్న అభిప్రాయాలను మార్చాలనే ఉద్దేశంతో ఈ పాటను తెరకెక్కించినట్లు చెప్పాడు.

Rapper roll rida new song  Nagali on farmer
రైతన్నపై ర్యాపర్​ రోల్​ రైడా 'నాగలి' సాంగ్​

By

Published : Aug 20, 2020, 6:40 PM IST

రైతన్నకు ఆక్రోశం వస్తే ఇలానే ఉంటది

తన పాటల్లో సామాజిక సమస్యలను విశ్లేషిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తోన్న ర్యాపర్.. రోల్ రైడా. ఆడపిల్లలపై జరుగుతోన్న అఘాయిత్యాలను అరుపు రూపంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైడా... తాజాగా రైతు కష్టాన్ని భుజానికెత్తుకున్నాడు.

ఆరుగాలం శ్రమించినా అప్పుల ఊబిలో కూరుకొని ఆయువు తీసుకుంటున్న రైతన్నకు ఆక్రోశం వస్తే ఎలా ఉంటుందో అంటూ 'నాగలి' అనే ప్రత్యేక ఆల్బమ్​ను విడుదల చేశాడు. హరికాంత్ దర్శకత్వంలో అజయ్ మైసూర్ నిర్మించిన ఈ వీడియోకు యువత నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

రైతును దేవుడిగా భావించాలనే దృక్పథంతో తీర్చిద్దిన ఈ పాటను... అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చిత్రీకరించారు. లాక్​డౌన్​ సమయంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సిబ్బందితో రామోజీఫిల్మ్ సిటీలో మూడు రోజులపాటు సాంగ్​ను చిత్రీకరించారు. రైతుల పట్ల నేటి తరానికున్న అభిప్రాయాలను మార్చాలనే ఉద్దేశంతో తమ పాటను విడుదల చేశామని తెలిపింది రైడా బృందం.

ఇది చూడండి 'అవును.. సుశాంత్​, సారా​ ప్రేమలో పడ్డారు!'

ABOUT THE AUTHOR

...view details