తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అవును మేం విడాకులు తీసుకున్నాం: నోయల్‌ - Rapper noel diverse

ప్రముఖ ర్యాపర్​ నోయల్​ తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. తామిద్దరి మధ్య మనస్పర్థలే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. ​

noel diverse
నోయల్

By

Published : Sep 1, 2020, 7:08 PM IST

యువ గాయకుడు, ర్యాపర్‌, నటుడు నోయల్‌‌ విడాకులు తీసుకున్నాడు. 2019లో నటి ఎస్తెర్‌తో అతడి వివాహం జరిగింది. కాగా తాజాగా వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై మంగళవారం నోయల్‌ స్పష్టత ఇచ్చాడు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాడు.

"ఈ విషయమై చాలా రోజులుగా మౌనంగా ఉన్నా. ఈరోజు ఎస్తెర్‌తో అధికారికంగా నా విడాకుల ప్రక్రియ పూర్తయింది. కోర్టు తీర్పు కోసమే ఇన్ని రోజులు మేం వేచి చూశాం. మా మధ్య మనస్పర్థలు రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ అందమైన బంధానికి స్వస్తి పలకాలని అనుకున్నాం. ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఎస్తెర్‌. నువ్వు కన్న కలలు నిజం కావాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తారని భావిస్తున్నా. నా జీవితంలో నేను కొన్ని చీకటి రోజులు గడిపా. అప్పుడు నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భవిష్యత్‌ మరింత అందంగా ఉంటుందని, ఇది కొత్త జీవితానికి ప్రారంభమని ఆశిస్తున్నా" అని నోయల్‌ రాసుకొచ్చాడు.

ఇది చూడండి రికార్డు ఫాలోవర్లతో దూసుకెళ్తోన్న అరియానా!

ABOUT THE AUTHOR

...view details