నవంబరు 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు అమెరికన్ ర్యాపర్ కేన్ వెస్ట్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించగా.. అతడి భార్య కిమ్ కర్దాషియాన్‌తో పాటు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు.
గతంలోనే ప్రకటన
ర్యాపర్ కేన్ వెస్ట్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు గతేడాది జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నానని అప్పట్లో ప్రకటించాడు కేన్.
అప్పట్లో ట్రంప్‌కు మద్దతు
2018 అక్టోబరులో ట్విట్టర్ ద్వారా ట్రంప్‌కు మద్దతు తెలిపాడు కేన్ వెస్ట్. ఆ తర్వాత వైట్‌హౌస్‌కు వెళ్లి.. ట్రంప్ ట్రేడ్‌మార్క్‌గా నిలిచిన 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' టోపీని ధరించి ఉపన్యాసం ఇచ్చాడు. అయితే నిద్రలేమి కారణంగా అలా చేశానని ఇప్పుడు చెప్పుకొచ్చాడు కేన్.