తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నారప్ప' లొకేషన్స్​.. రామ్​ కెరీర్​లోనే రికార్డు ధర! - వెంకటేశ్​ నారప్ప లొకేషన్స్​ వీడియో

కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. ఇందులో హీరో వెంకటేశ్​, రామ్​ పోతినేని సహా మరి కొన్ని సినిమా వివరాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం..

cinema updates
సినిమా అప్డేట్స్​

By

Published : Aug 3, 2021, 5:42 PM IST

రామ్‌ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ RAPO19 వర్కింగ్‌ టైటిల్‌తో శరవేగంగా సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఆడియో హక్కులకు రికార్డు ధర లభించినట్లు తెలుస్తోంది. దీని కోసం 'ఆదిత్య మ్యూజిక్‌' రూ.2.75కోట్లు వెచ్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ ఆడియో హక్కులను కొనుగోలు చేసింది. ఇదే నిజమైతే రామ్‌ కెరీర్‌లో ఆడియో హక్కుల విషయంలో ఈ సినిమాదే రికార్డు అవుతుంది.

ఈ చిత్రంలో రామ్‌ సరసన 'ఉప్పెన' హీరోయిన్‌ కృతిశెట్టి సందడి చేయనుంది. ఆది పినిశెట్టి కీలకపాత్రలో కనిపించనున్నాడు. మరో భామ అక్షరగౌడ ప్రత్యేక ఆకర్షణ కానుంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

రామ్​ పోతినేని సినిమా ఆడియో రైట్స్​కు రికార్డు ధర

వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన చిత్రం 'నారప్ప'. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఇటీవల విడుదలై, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రీకరణకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు వెంకటేశ్‌. ఇందులో సినిమాను ప్రారంభించిన ముహూర్తపు షాట్‌, దేవాలయం, థియేటర్‌ తదితర లొకేషన్లు చూపించారు. ఒక్కో సన్నివేశాన్ని తెరకెక్కించేందుకు చిత్ర బృందం ఎంత కష్టపడిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. తమిళ సినిమా 'అసురన్‌'కు రీమేక్‌గా 'నారప్ప' రూపొందింది. ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రాజీవ్‌ కనకాల, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కళైపులి ఎస్‌. థాను సమర్పణలో సురేశ్‌ బాబు నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.

'టాయ్​లెట్​: ఏక్ ప్రేమ్ కథ' చిత్రంలో భార్యాభర్తలుగా నటించి ఆకట్టుకున్నారు అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న మరో చిత్రం 'రక్షాబంధన్'. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన ముంబయి షెడ్యూల్​ పూర్తైంది. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ షూటింగ్​కు సంబంధించిన ఫొటోస్​ను పోస్ట్​ చేసింది.

అక్షయ్​ కుమార్​ రక్షాబంధన్​
అక్షయ్​ కుమార్​ రక్షాబంధన్​
వివాహభోజనంబు
ప్రభుదేవా సినిమా
ప్లాన్​ బి
హెల్ప్​ మి ఫస్ట్​లుక్​

ఇదీ చూడండి: శర్వా చిత్రంలో ముగ్గురు స్టార్​​ నటీమణులు

ABOUT THE AUTHOR

...view details