తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రామ్​ సరసన మరో హీరోయిన్.. సుదీప్​తో జాక్వెలిన్! - అక్షర గౌడ్

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి కాంబోలో తెరకెక్కబోయే చిత్రంలో మరో హీరోయిన్​గా అక్షర గౌడ నటించనుందని చిత్రబృందం వెల్లడించింది. అలాగే.. కన్నడ స్టార్​ కిచ్చ సుదీప్ నటిస్తోన్న 'విక్రాంత్​ రోణ'కు సంబంధించి ఓ మోషన్​ పోస్టర్​ విడుదలైంది.

rapo19, vikranth rona
రాపో, విక్రాంత్ రోణ

By

Published : Jul 31, 2021, 5:52 PM IST

టాలీవుడ్​ యువ కథానాయకుడు రామ్​ పోతినేని.. కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి కాంబోలో తెరకెక్కబోయే సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైన రాపో19(వర్కింగ్ టైటిల్) సినిమాలో మరో హీరోయిన్​గా అక్షర గౌడ నటించనుందని చిత్రబృందం పేర్కొంది. దానికి సంబంధించిన పోస్టర్​ను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.

అక్షర గౌడ

ఇప్పటికే ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్​గా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. మరోవైపు హీరో రామ్​ వరుస హిట్లతో జోష్​ మీద ఉండటం, ఈ కొత్త జోడీ కలయిక వల్ల అభిమానుల్లో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు.

విక్రాంత్ రోణ..

కన్నడ స్టార్​ కిచ్చ సుదీప్​ హీరోగా తెరకెక్కుతోన్న పాన్​ ఇండియా సినిమా 'విక్రాంత్​ రోణ' త్వరలోనే విడుదలకు నోచుకోనుంది. అయితే.. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్​ ఓ ఐటమ్​ సాంగ్​ చేసింది. జానీ మాస్టర్​ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట కోసం భారీగా ఖర్చు చేసింది చిత్రబృందం. దీనికి సంబంధించిన మోషన్​ పోస్టర్​ను తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్.

అనూప్​ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాన్​ మంజునాథ్​, షాలిని మంజునాథ్​ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడతో పాటు మరో ఐదు విదేశీ భాషల్లో ఈ సినిమా రిలీజ్​ కానుంది.

ఇదీ చదవండి:'సర్కారు వారి పాట' ఫస్ట్​లుక్ ఆగయా.. సంక్రాంతికి రిలీజ్

ABOUT THE AUTHOR

...view details