బ్యాట్‌మ్యాన్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సూపర్‌హీరోకు ఎంతో క్రేజ్. డీసీ కామిక్స్ సృష్టైన ఈ గబ్బిలం మనిషి పాత్రను మొన్నటివరకు హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లేక్ పోషించాడు. ఇటీవల అతడు తప్పుకోగా... ఆ పాత్రలో మరో హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ నటించనున్నట్టు సమాచారం. అయితే ఈ అంశంపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. రాబర్ట్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.
వ్యాంపైర్.. కాబోతున్నాడు బ్యాట్‌మ్యాన్!
హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్పై వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. రాబర్ట్.. బ్యాట్‌మ్యాన్‌గా నటించనున్నాడని తెలిసి అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటివరకు బ్యాట్‌మ్యాన్‌గా నటించిన బెన్ అఫ్లెక్ ఇటీవల తప్పుకున్న సంగతి తెలిసిందే.
బ్యాట్‌మ్యాన్ పాత్ర కోసం డీసీ సంస్థ రాబర్ట్‌తో చర్చలు జరుపుతోంది. ఈ పరిణామంపై అసంతృప్తి చెందిన నెటిజన్లు రాబర్ట్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. "రాబర్ట్.. బ్యాట్మ్యానా.. నాకు భయమేస్తుంది" అని ఒకరు పోస్ట్ చేస్తే.. "వ్యాంపైర్లు గబ్బిలాలుగా మారతాయనే దానికి ఇదే నిదర్శనం" అని మరొకరు ట్రోల్ చేశారు. మొత్తానికి అధికారిక ప్రకటన రాకముందే ఈ ట్విలైట్ హీరోకు నెట్టింట చురకలంటుతున్నాయి.
ట్విలైట్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాబర్ట్ ప్యాటిన్సన్ . అందులో వ్యాంపైర్‌గా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు.