తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వంట విషయంలో రణ్​వీర్​కు దీపిక ఛాలెంజ్ - దీపిక పదుకొణె రణ్​వీర్ వార్తలు

తన భార్య దీపిక పదుకొణెకు ఇచ్చిన ఓ మాటను ఇప్పటికీ నిలబెట్టుకోలేకపోయానని చెప్పారు రణ్​వీర్ సింగ్. తాజాగా ఆమె విసిరిన ఛాలెంజ్​లో భాగంగా బ్రేక్​ఫాస్ట్ చేస్తానని తెలిపారు.

వంట విషయంలో రణ్​వీర్​కు దీపిక ఛాలెంజ్
దీపికా పదుకొణె రణ్​వీర్ సింగ్

By

Published : May 26, 2020, 7:56 AM IST

తన సతీమణి దీపికా పదుకొణెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నానని హీరో రణ్‌వీర్‌ సింగ్‌ అన్నారు. ఆమెను ఇంప్రెస్‌ చేయడానికి ఒకప్పుడు రణ్‌వీర్‌ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆమెకు పూలు పంపడం, రొమాంటిక్‌ డేట్స్‌ ప్లాన్‌ చేయడం ఇలాంటి చాలానే ఉన్నాయి. ఇద్దరి మధ్య బంధం బలపడుతున్న సమయంలో దీపికకు రణ్‌వీర్‌ ఓ మాటిచ్చారట. తనకోసం ప్రత్యేకంగా భోజనం వండుతానని చెప్పానని, కానీ ఇంత వరకు చేయలేదని తాజాగా 'గల్లీబాయ్‌' ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో తెలిపారు.

'నేను బటర్‌ చికెన్‌ చాలా బాగా చేస్తా. అమెరికా యూనివర్శిటీలో చదువుతున్న రోజుల్లో నేను బటర్‌ చికెన్‌ చేస్తే తినడానికి నా స్నేహితులు క్యూ కట్టేవారు. కానీ అది ‘చీటింగ్‌ బటర్‌ చికెన్‌’ (నవ్వుతూ).. రెడీమేడ్‌గా తీసుకొచ్చిన పదార్థాల్ని మిక్స్‌ చేసి అందరికీ పెట్టేవాడ్ని. రెడీమేడ్‌ ప్యాకెట్స్‌ ఉపయోగించడం చాలా సులభం. అవి లేకపోతే నాకు కేవలం గుడ్డు-బ్రెడ్‌ మాత్రమే మిగిలేవి. నేను కేవలం గుడ్డు మాత్రమే వండగలను. నిజానికి దీపికకు వంట చేయడం చాలా ఇష్టం. నాకంటే బాగా చేస్తుంది. అందుకే వంట గది బాధ్యతల్ని ఆమెకే అప్పగించా. కానీ నేను ఆమెకు గొప్ప అసిస్టెంట్‌ను. ఆమె ఏది వండినా సాయం చేస్తుంటా. ప్రత్యేకించి ఈ లాక్‌డౌన్‌లో సాయం చేయడానికి సమయం దొరికింది' అని రణ్‌వీర్‌ చెప్పారు.

అనంతరం లైవ్‌లో దీపిక కామెంట్‌ చేశారు. ‘అన్నీ అబద్దాలే’ అన్నారు. 'నీకు గుడ్లు వండటమూ రాదు. నేను చెప్పేది అబద్ధం అయితే.. ఇప్పుడే లైవ్‌లో వండి నిరూపించు' అన్నారు. దీనికి రణ్‌వీర్‌ స్పందిస్తూ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, తర్వాతి రోజు బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తానని చెప్పారు. రణ్‌వీర్‌, దీపిక త్వరలో '83' సినిమాలో కనిపించనున్నారు. కబీర్‌ ఖాన్‌ దర్శకుడు. ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది

ABOUT THE AUTHOR

...view details