Ranveer post: బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తన భార్య, నటి దీపికా పదుకొణెను పొగడ్తలతో ముంచెత్తాడు. తాజాగా విడుదలైన 'గెహ్రాహియా' చిత్రంలో ఆమె నటించిన తీరు గర్వంగా ఉందన్నాడు. విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఆమెని ముద్దుపెడుతూ దిగిన ఫోటోను రణ్వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఫోటోతో సహా పలకడానికి సైతం కష్టంగా ఉన్న ఇంగ్లీష్ పదాలతో దీపికని పొగిడాడు. "'గెహ్రాహియా' నీ నటన అద్భుతంగా, అత్యద్భుతంగా ఉంది. ఇలాంటి కళాత్మక ప్రదర్శన చూశాక నాకు గర్వంగా ఉంది." అని పోస్ట్ చేశాడు.
శశిథరూర్ రాశారు..
రణ్వీర్ పోస్ట్ చేసిన ఫోటోపై అభిమానులు ఆసక్తికర కామెంట్లు చేశారు. "కచ్చితంగా ఇది ముచ్చటైన జంట" అని ఒకరు కామెంట్ చేయగా.. "ఈ చిత్రం నా మనస్సును దోచేస్తుంది" అని మరొకరు కామెంట్ చేశారు. "ఈ క్యాప్షన్‌ని శశి థరూర్ రాశారు" అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టారు. కాంగ్రెస్ నేత అయిన శశిథరూర్ పలకడానికి సైతం కష్టంగా ఉండే పదాలను ఉపయోగిస్తూ ప్రసిద్ధి చెందారు.
'గెహ్రాహియా' చిత్రంలో నటనకు దీపికా ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. ఇందులో ప్రేమ, మానవ సంబంధాల గురించి ప్రస్తావించారు.
ఇదీ చదవండి:జిగేల్మంటున్న నందిని రాయ్ అందాలు!