బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్-ప్రముఖ దర్శకుడు శంకర్ కలిసి సినిమా చేయనున్నారా? అవుననే మాట్లాడుకుంటున్నాయి సినీ వర్గాలు. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రణ్వీర్.. ఓ పాన్ ఇండియా సినిమాలో నటించే ఆలోచనలో ఉన్నాడు. ఇందుకోసం శంకర్‌తో కలిసి పనిచేయాలని నిశ్చయించుకున్నాడట. ఈ క్రమంలోనే అతడు ఇటీవల చెన్నై వెళ్లి శంకర్‌ను కలిసి ఈ విషయమై చర్చించాడని సమాచారం. ఇందుకు సుముఖత చూపిన దర్శకుడు.. రణ్వీర్ కోసం కథ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
శంకర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్?
ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో నటించాలని భావిస్తున్నాడు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. ఇందుకోసం ఇటీవల చెన్నై వెళ్లి శంకర్‌ను కూడా కలిశాడని సమాచారం.
రణ్వీర్
ప్రస్తుతం శంకర్.. కమలహాసన్‌తో 'భారతీయుడు 2' సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత హీరో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ రెండు చిత్రాలు పూర్తవ్వగానే రణ్వీర్తో సినిమా చేసే అవకాశముంది. కాగా, రణ్వీర్ ప్రస్తుతం 'సర్కస్' సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 4న '83' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇదీ చూడండి: రణ్వీర్ సింగ్ '83' విడుదల తేదీ ఫిక్స్