బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్.. సినిమాలు చేస్తూ, ఫ్యాషన్ షోలకు హాజరవుతూ ఉంటాడు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నాసరే తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం చాలా సరదాగా గడుపుతుంటాడీ నటుడు. ఇటీవలే 'వోగ్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్' అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యాడు. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అని విలేకరి అడిగిన ప్రశ్నకు తనదైన సమాధానమిచ్చాడు.
"వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను సమానంగా చూస్తాను. ఈ రెండింటి మధ్య సమయాన్ని సద్వినియోగం చేసుకోనే విషయంలో నా భార్య దీపికా పదుకొణె నాకు ఆదర్శం. ఎందుకంటే సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడంలో తను మాస్టర్, అప్పుడప్పడు ఆమె సలహాలు కూడా తీసుకుంటా" -రణ్వీర్ సింగ్, హీరో