తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రణ్​వీర్​ సింగ్​ '83' విడుదల తేదీ​ ఫిక్స్​ - రణ్​వీర్​ సింగ్ కొత్త సినిమా పోస్టర్​

బాలీవుడ్​ హీరో రణ్​వీర్​ సింగ్​ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. '83' సినిమాను.. జూన్​లో థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపాడు. సినిమాలోని ఓ కొత్త పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నాడు.

Ranveer Singh-starrer cricket drama '83' to release in June
రణ్​వీర్​ సింగ్​ '83' విడుదల తేదీ​ ఫిక్స్​

By

Published : Feb 19, 2021, 11:04 PM IST

బాలీవుడ్​ నటుడు రణ్​వీర్​ సింగ్​ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 83 సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జూన్​ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఈ చిత్ర బృందం ప్రకటించింది.

1983లో కపిల్​ దేవ్​ సారథ్యంలో టీమ్​ఇండియా.. ప్రపంచ కప్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలుత ఈ సినిమాను గతేడాది ఏప్రిల్​లో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ కరోనా లాక్​డౌన్​తో విడుదల వాయిదా పడింది. తాజాగా జూన్​ 4న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు హీరో రణ్​వీర్ తన​ ట్విట్టర్​​ వేదికగా తెలిపాడు. ఈ సినిమాలోని కొత్త పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నాడు.

బాలీవుడ్​ దిగ్గజ దర్శకుడు కబీర్​ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను హిందీ సహా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 3డీ ఫార్మాట్​లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో హార్దీ సందు, దీపికా పదుకొణె, తాహీర్​ రాజ్​ భాసిన్​, జీవా, ఆర్మీ తదితరులు నటించారు. రిలయన్స్​ ఎంటర్​టైన్​మెంట్​ సంస్థ​ సమర్పిస్తోంది.

ఇదీ చదవండి:అక్షయ్​ 3 సినిమాల విడుదల తేదీలు ఖరారు

ABOUT THE AUTHOR

...view details