తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రేమికుడు.. ఊర్వశీ'ని రణ్‌వీర్‌ భలే పాడేశాడుగా..! - ranveer sing a song from premikudu

ప్రేమికుడు చిత్రంలోని 'టేక్ ఇట్ ఈజీ ఊర్వశీ' పాట అంటే తనకెంతో ఇష్టమని అన్నాడు బాలీవుడ్ నటుడు రణ్​వీర్ సింగ్. అంతేకాదు ఆ సాంగ్​ను పాడి వినిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

రణ్​వీర్

By

Published : Oct 19, 2019, 6:49 AM IST

ఏఆర్‌ రెహమాన్‌ స్వరపర్చిన అద్భుతమైన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో 'ప్రేమికుడు' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించాడు. 1994లో విడుదలైన ఈ చిత్రం ఇటు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సినీప్రియుల్ని ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని 'ముక్కాబులా..’', 'ఊర్వశీ..' గీతాలు నాటి నుంచి నేటి వరకు యువతరం మదిలో మారుమోగుతూనే ఉన్నాయి.

ఈ ఆల్బమ్‌లోని పాటల్లో 'టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశీ' పాట అంటే తనకూ ఎంతో ఇష్టమన్నాడు రణ్‌వీర్‌ సింగ్‌. తాజాగా ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపాడు. ఈ పాటను తాను ప్రతిరోజూ వింటుంటానని, అందుకే ఆ పాట ఇప్పటికీ తన మదిలో చిరస్థాయిగా నిలిచిపోయినట్లు రణ్‌వీర్‌ తెలిపాడు. అంతేకాదు.. ఈ పాట హిందీ వెర్షన్‌ను ఎంతో చక్కగా ఆలపించి చూపించాడీ హీరో. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఏఆర్‌ రెహమాన్‌ ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ సందడి చేస్తోంది.

ఇవీ చూడండి.. పాడుతూ స్టేజిపై నుంచి కిందపడ్డ పాప్ సింగర్

ABOUT THE AUTHOR

...view details