హీరోయిన్, తన భార్య దీపికా పదుకొణె.. ప్రతి విజయంలోనూ తోడుగా ఉండి, దానిని సెలబ్రేట్ చేసుకునే వారిలో ముందుంటారు ఆమె భర్త రణ్వీర్ సింగ్. అయితే తాను ప్రపంచంలోనే గర్వించదగ్గ భర్తనని రణ్వీర్ అన్నారు. దీపిక సొంత వెబ్సైట్ ఆవిష్కరణ సందర్భంగా గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోనే గర్వించదగ్గ భర్త నేను: రణ్వీర్ - movie news
తన భార్య దీపికతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న రణ్వీర్ సింగ్.. ప్రపంచం గర్వించదగ్గ భర్తను తానని అన్నారు. ఆమె వెబ్సైట్ లాంచ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"నా జీవితంలో కలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తి దీపికా. ఆమె నా భార్య అని ఇలా అనడం లేదు. ప్రేమ, కరుణ, దయ, తెలివితేటలు, అందం లాంటి లక్షణాలన్ని ఆమెను నిజమైన నటిగా తీర్చిదిద్దాయి. ప్రపంచంలోనే ఉత్తమ నటుల్లో ఆమె కూడా ఒకరు. అప్పుడప్పుడు ఆమెను ఆరాధిస్తుంటాను. అందుకే ప్రపంచంలోనే గర్వించదగ్గ భర్తను నేను" అని రణ్వీర్ సింగ్ రాసుకొచ్చారు.
రణ్వీర్-దీపిక.. 'రామ్లీలా', 'పద్మావత్', 'భాజీరావ్ మస్తానీ' సినిమాల్లో కలిసి నటించారు. 1983 వన్డే ప్రపంచకప్ ఆధారంగా తీసిన '83' విడుదల కావాల్సి ఉంది.