బాలీవుడ్ యువ హీరో రణ్వీర్ సింగ్ కారు చిన్న ప్రమాదానికి గురైంది. వెనక నుంచి వచ్చిన ఓ బైక్ అతడి కారును ఢీకొట్టింది. ముంబయి బాంద్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రణ్వీర్కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు.
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కారుకు ప్రమాదం - రణ్వీర్ సింగ్ కారు ప్రమాదం
ముంబయి బాంద్రాలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కారును ఓ ద్విచక్ర వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నటుడు సురక్షితంగా బయటపడ్డాడు.

రణ్వీర్ సింగ్ కారును ఢీకొట్టిన బైక్
రణ్వీర్ సింగ్
ఈ ప్రమాదం జరిగిన వెంటనే రణ్వీర్ కారు దిగి ప్రమాద తీవ్రతను పరిశీలించాడు. కారుకు ఏమైనా నష్టం జరిగిందో లేదో అని తెలుసుకున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
ప్రస్తుతం రణ్వీర్ '83' అనే చిత్రం చేస్తున్నాడు. 1983లో కపిల్ సేన భారత్కు ప్రపంచకప్ తీసుకొచ్చిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కపిల్ భార్య రోమీ పాత్రలో దీపికా పదుకొణె కనిపించనుంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు.