తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​బాబు జెంటిల్మన్.. బాలీవుడ్​ హీరో ప్రశంసలు - రణ్​వీర్ మహేశ్​బాబు థంబ్స్ అప్

మహేశ్​తో పనిచేయడం చాలా గర్వంగా ఉందని చెప్పారు బాలీవుడ్ హీరో రణ్​వీర్ సింగ్. తనో 'ఫైనెస్ట్ జెంటిల్మన్' అని అన్నారు.

Ranveer Singh heaps praise on Mahesh Babu, calls him 'finest gentlemen'
మహేశ్​బాబు​పై బాలీవుడ్​ హీరో ప్రశంసలు

By

Published : Dec 26, 2020, 11:50 AM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబును బాలీవుడ్ హీరో రణ్​వీర్ సింగ్ ప్రశంసించారు. తన ఇన్​స్టాలో మహేశ్​తో ఉన్న ఫొటోను పంచుకుని పోస్ట్ పెట్టారు. ఓ కూల్​ డ్రింక్​కు బ్రాండ్​ అంబాసిడర్లుగా ఉన్న వీరిద్దరూ.. ఇటీవల దాని ప్రకటనకు సంబంధించిన షూటింగ్​లో పాల్గొన్నారు.

"నేను కలిసి పనిచేసిన వారిలో మీరు అద్భుతమైన వ్యక్తి. మన మాట్లాడుకున్న సందర్భాలు ఎప్పటికీ గుర్తుంటాయి.. బిగ్ బ్రదర్ మహేశ్​కు ప్రేమతో" -రణ్​వీర్ సింగ్, బాలీవుడ్ హీరో

సినిమాల విషయానికొస్తే 'సర్కారు వారి పాట' షూటింగ్​ కోసం మహేశ్​ సిద్ధమవుతున్నారు. జనవరి నుంచి అమెరికాలో చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రణ్​వీర్ నటించిన '83' విడుదలకు రెడీగా ఉంది. 'జయేష్​భాయ్ జోర్దార్', 'సర్కస్' ప్రారంభం కావాల్సి ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details