తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జపనీస్​ హీరోలా రణ్​వీర్​ 'న్యూ లుక్​'

బాలీవుడ్​ హీరో రణ్​వీర్​ సింగ్​ సరికొత్త హెయిర్​ స్టయిల్​తో దర్శనమిచ్చాడు. తన సతీమణి, నటి దీపికా పదుకొనే ఈ కొత్త లుక్​లో రెడీ చేసినట్లు చెప్పుకొచ్చాడు.​

Ranveer Singh
జపనీస్​ హీరోలా రణ్​వీర్​ సింగ్​ లుక్​

By

Published : Jul 21, 2020, 9:19 AM IST

హిందీ చిత్రపరిశ్రమలో స్టార్​ హీరో అయిన రణ్​వీర్​ సింగ్.. ఎప్పుడూ తనదైన ఫ్యాషన్​ దుస్తులతో అభిమానులను ఆకట్టుకుంటాడు. సరికొత్త డిజైన్లు, రంగురంగుల దుస్తులతో కనువిందు చేస్తుంటాడు. తాజాగా వావ్​ అనిపించేలా కొత్త హెయిర్​స్టయిల్​తో దర్శనమిచ్చాడు. తన భార్య, నటి దీపికా పదుకొనే తన లుక్​ సృష్టికర్త అంటూ ప్రశంసలు కురిపించాడు.

తన హెయిర్​ స్టయిల్​ చూడగానే జపాన్​ నటుడు తొషిరో మిఫునేలా గుర్తొచ్చినట్లు చెప్పుకొచ్చాడు రణ్​వీర్​. 1961లో విడుదలైన సమురాయ్​ ఫిల్మ్​ యోజింబో(బాడీగార్డ్​)లో హీరో కేశాలు ఇలానే ఉంటాయి కదా అని అభిమానులను ప్రశ్నించాడు. ఈ పోస్టును ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు లుక్​ బాగుందని కామెంట్లు పెడుతున్నారు.

ఈ గల్లీబాయ్‌ త్వరలో '83', 'జయేష్‌భాయ్‌ జోర్దార్‌' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీపికా తాజాగా ప్రభాస్​-నాగ్​ అశ్విన్​ ప్రాజెక్టులో భాగస్వామ్యమైంది.

ABOUT THE AUTHOR

...view details