నటనతో కాకుండా విభిన్నమైన ఫ్యాషన్తోనూ అలరిస్తుంటాడు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. ఎప్పటికప్పుడు విచిత్రమైన దుస్తులు ధరిస్తూ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇటీవల ణ్వీర్ ధరించిన కళ్లజోడు గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు టీమిండియా క్రికెటర్ ధోనీ. తన కూతురు జీవా దగ్గర అలాంటిదే ఉందంటూ ఓ ఆసక్తికర ఫొటోను ఇన్స్టాలో పంచుకున్నాడు.
"జీవా.. తన కళ్లద్దాలు అతను (రణ్వీర్ సింగ్) పెట్టుకున్నాడేంటని నన్ను ఒకరోజు అడిగింది. వెంటనే తన గదిలోకి వెళ్లి తనవి ఉన్నాయో లేదో వెతికి.. దొరికిన వెంటనే సంతోషపడింది. ఇప్పటి పిల్లలు చాలా విభిన్నం. ఆ వయసులో నేనైతే, కనీసం ఇద్దరి దగ్గరా ఒకేలాంటి కళ్లజోడు ఉందని కూడా గుర్తుపట్టేవాడని కానేమో. తర్వాత ఎప్పుడైనా జీవా.. రణ్వీర్ను కలిసినప్పుడు కచ్చితంగా ఈ కళ్లద్దాల గురించి అడుగుతుంది" -మహేంద్ర సింగ్ ధోనీ, టీమిండియా క్రికెటర్