అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న సినిమా 'సూర్యవంశీ'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రీకరణ సమయంలో హీరోలు రణ్వీర్, అజయ్ దేవగణ్తో తీసుకున్న ఓ ఆసక్తికర ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడీ కథానాయకుడు.
ఈ ఫొటోలో ముగ్గురు హీరోలు పోలీసు దుస్తుల్లో కనువిందు చేస్తున్నారు. ఇంతకుముందు రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన 'సింగం'లో అజయ్ దేవ్గణ్, 'సింబా'లో రణ్వీర్ సింగ్ కథానాయకులుగా నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నాయి.