తెలుగులో విశేష ప్రేక్షకాదరణ పొందిన చాలా చిత్రాలు బాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమకు నచ్చిన కథల్ని అక్కడి హీరోలతో పునఃనిర్మిస్తున్నారు హిందీ చిత్ర సీమ దర్శక, నిర్మాతలు. ఈ జాబితాలో 'ఇస్మార్ట్ శంకర్' నిలవనుంది.
'ఇస్మార్ట్ శంకర్'గా రణ్‌వీర్ సింగ్! - రణ్‌వీర్ సింగ్
రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమాను బాలీవుడ్లో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇందులో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తాడని సమాచారం.
రామ్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రమిది. నభానటేష్ , నిధి అగర్వాల్ నాయికలు. పూర్తి యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచే పాత్ర ఇది. అందుకే బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాపై మనసు పడ్డాడని సమాచారం. ఈ చిత్రానికి హిందీలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రామ్ పాత్రలో నటించేందుకు రణ్‌వీర్ ఆసక్తి చూపిస్తున్నాడని టాక్. మరి దర్శకుడు ఎవరనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.