టాలీవుడ్‌తో పాటు బీటౌన్‌లోనూ వరుస ఆఫర్లతో టాప్‌గేర్‌లో దూసుకెళుతోంది ముద్దుగుమ్మ పూజా హెగ్డే. గతేడాది ఆమె నటించిన 'అల వైకుంఠపురములో'(ala vaikunthapurramuloo review) చిత్రం భారీ విజయం సాధించింది. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఆమె పలు చిత్రాలకు ఇప్పటికే సంతకాలు చేసేసింది. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి 'సర్కస్' (cirkus) చిత్రంలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా పూజ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
pooja hegde: రణ్‌వీర్ నుంచి అది దొంగిలిస్తా! - పూజా హెగ్డే, రణ్‌వీర్ సింగ్
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది పూజా హెగ్డే(pooja hegde). ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ సరసన 'సర్కస్'(cirkus) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఈ పొడుగు కాళ్ల సుందరి పలు విషయాలు పంచుకుంది.
"రణ్‌వీర్‌సింగ్ నుంచి ఏదైనా దొంగిలించాలంటే ఏం తీసుకుంటారు? "అని ఎదురైన ప్రశ్నకు పూజ స్పందించింది. "ఒకవేళ రణ్‌వీర్ నుంచి ఏదైనా తీసుకునే అవకాశం వస్తే.. అతని ఎనర్జీ, పరిశీలన శక్తిని తీసుకుంటా. అతను చాలా తెలివైనవాడు. దేన్నీ అంత సులువుగా వదిలిపెట్టడు. నాకు ఆ విషయం బాగా నచ్చుతుంది. నిజానికి నేను ఇంట్రోవర్ట్‌ని. కానీ, రణ్‌వీర్ నాకు పూర్తి భిన్నమైన వ్యక్తి. కొన్నిసార్లు రణ్‌వీర్‌లా ఉండాలనిపిస్తుంది" అని పూజ చెప్పుకొచ్చింది.
పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తోంది. 'రాధేశ్యామ్'(radheshyam)లో ప్రభాస్ సరసన సందడి చేయనుంది. మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'ఆచార్య'(Acharya)తో పాటు ఆమె 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'లో అక్కినేని అఖిల్‌తో ఈ భామ ఆడిపాడనుంది. తమిళ స్టార్ హీరో విజయ్ 65వ సినిమాలోనూ నటిస్తోంది. అది చిత్రీకరణ దశలో ఉంది. హిందీలో 'సర్కస్', 'కభీ ఈద్ కభీ దివాళి' చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.