తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కపిల్​దేవ్​ ​లుక్​లో అదరిపోయిన రణ్​వీర్

బాలీవుడ్​ నటుడు రణ్​వీర్​ సింగ్​ ​నటిస్తోన్న చిత్రం '83'. ప్రపంచకప్​ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కపిల్​దేవ్​ పాత్ర పోషిస్తున్నాడు రణ్​వీర్​. ఇందుకు సంబంధించిన లుక్​ను అభిమానులతో పంచుకున్నాడు.

కపిల్​దేవ్​ ​లుక్​లో అదరిపోయిన రణ్​వీర్

By

Published : May 1, 2019, 1:36 PM IST

టాలీవుడ్​, బాలీవుడ్​లలో బయోపిక్​ ట్రెండ్​ నడుస్తోంది. ప్రస్తుతం 1983లో ప్రపంచకప్​ కథాంశంతో రణ్​వీర్​ సింగ్ హీరోగా ​'83' సినిమా రూపొందుతోంది. ఇందులో భారత క్రికెటర్​ కపిల్​దేవ్​ పాత్ర పోషిస్తున్నాడు రణ్​వీర్​. ఈ సినిమాలో తన లుక్​ సంబంధించిన ఫొటోను ఇన్​స్టాగ్రామ్​ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కపిల్ తరహాలో జులపాల జట్టు, మీసకట్టుతో ఆకట్టుకుంటున్నాడు.

కబీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details