తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వ్యాఖ్యాతగా రణ్​వీర్​.. మైదానంలో సందడి సందడిగా - pakisthan

ఆదివారం జరిగిన భారత్​-పాకిస్థాన్ మధ్య ప్రపంచకప్​ మ్యాచ్​లో సందడి చేశారు బాలీవుడ్ నటుడు రణ్​వీర్. మాజీ క్రీడాకారుడు సునీల్ గావస్కర్​తో కలిసి ఓ హిందీ పాటకు స్టెప్పులేశారు. కాసేపు వ్యాఖ్యాతగానూ వ్యవహరించారు.

వ్యాఖ్యాత రణ్​వీర్.. మైదానంలో స్టెప్పులేశాడు

By

Published : Jun 18, 2019, 9:40 AM IST

భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్​ అంటే సాధారణ ప్రజానీకానికే కాదు... సెలబ్రిటీలకు ఉద్వేగమే. ఆదివారం దాయాది జట్టుతో జరిగిన ప్రపంచకప్​ మ్యాచ్ సందర్భంగా మైదానంలో సందడి చేశారు బాలీవుడ్ నటుడు రణ్​వీర్ సింగ్. మాంచెస్టర్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్​తో కలిసి మైదానంలో స్టెప్పులేశారు. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా బదాన్ పే సితారే అనే హిందీ పాటకు కాలు కదిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.

వ్యాఖ్యాతగానూ...

మ్యాచ్ సందర్భంగా గావస్కర్​తో కలిసి కాసేపు కామెంటేటర్​గానూ వ్యవహరించారు రణ్​వీర్. చక్కగా చేశావని రణ్​వీర్​ను గావస్కర్ మెచ్చుకోవడం విశేషం.

కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా ‘83’ అనే చిత్రం... రణ్​వీర్ కథానాయకుడిగా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ మీద రణ్‌వీర్‌ పట్టు పెంచుకుంటున్నారు.

ఇదీ చూడండి: టాప్​ 5లో బంగ్లాదేశ్... విండీస్​పై 7 వికెట్లతో విజయం​

ABOUT THE AUTHOR

...view details