చిత్రసీమలో కొన్ని కాంబినేషన్లు మళ్లీ మళ్లీ చూడాలపినిస్తుంది. అలా మళ్లీ ప్రేక్షకులను మెప్పించడానికి తెరపైకి వస్తున్నారు బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ. గతంలో వీరిద్దరూ కలిసి కునాల్ కోహ్లీ దర్శకత్వంలో 'హమ్ తుమ్' అనే చిత్రంలో నటించి అలరించారు. ఆ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'త ర రమ్ పమ్'లోనూ కలిసి పనిచేశారు.
మరోసారి కలిసి నటించనున్న సైఫ్-రాణి - బాలీవుడ్ సినిమా వార్తలు
బాలీవుడ్ హిట్ పెయిర్ సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ మరోసారి కలిసి నటిస్తున్నారు. 'బంటి ఔర్ బబ్లీ 2'లో వీరిద్దరూ తెర పంచుకోనున్నారు.
సైఫ్-రాణి
సుమారు పదకొండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు 'బంటీ ఔర్ బబ్లీ2' చిత్రంలో మరోసారి కలిసి నటిస్తున్నారు. వరుణ్ వి.శర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించనున్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో తెరపై తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.
Last Updated : Dec 20, 2019, 7:09 AM IST