తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రేమ గీతం ఇలా 'రంగులద్దుకుంది' - బుచ్చిబాబు సానా

దేవిశ్రీ ప్రసాద్​ సంగీత దర్శకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఉప్పెన'. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలకు శ్రోతలనుంచి మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో 'రంగులద్దుకుంది' అనే మరో పాట విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది చిత్ర యూనిట్.

Uppena Song
ఉప్పెనలో 'రంగులద్దుకుంది' ఓ ప్రేమగీతం

By

Published : Nov 8, 2020, 8:54 PM IST

ప్రేమించిన విషయం ప్రేమించిన వారికే చెప్పకపోతే? ఒకరికి తెలికుండా మరొకరు రహస్యంగా ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటుంటే ఎలా ఉంటుంది? అదే పాట రూపంలో చెప్పబోతుంది 'ఉప్పెన' చిత్రబృందం. వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని 'నీ కన్ను నీలి సముద్రం', 'ధక్‌ ధక్‌ ధక్‌' పాటలు విశేష ఆదరణ పొందాయి. హ్యాట్రిక్‌ కొట్టేందుకు మరోపాట ముస్తాబైంది. 'రంగులద్దుకున్న' అంటూ సాగే ఈ (మూగ) ప్రేమ గీతం ఎలా పుట్టిందో ఓ వీడియో ద్వారా పంచుకున్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌.

చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా దేవికి వీడియో కాల్‌ చేసి 'ఇప్పటికే రెండు పాటలు హిట్‌ అయ్యాయి. మూడో పాట కూడా హిట్‌ అయితే హ్యాట్రిక్‌ కొట్టేస్తాం' అని చెప్పగా మధ్యలో దర్శకుడు సుకుమార్‌ దర్శనమిస్తారు. అప్పటికే లైన్లో ఉన్న ఆయన 'డార్లింగ్‌ నీకు ఏమైనా సీక్రెట్ లవ్‌ స్టోరీలున్నాయా.. నాకు కొన్ని చెప్పావను‍కో.. నాకు చెప్పినవన్నీ సీక్రెట్లు అవ్వకు కదా. ఏదోటి ఉంటదేమో అని డౌట్‌ నాకు' అంటూ డీఎస్పీని చమత్కరిస్తారు. మీకు తెలీకుండా ఏం ఉంటాయ్‌ సుక్కూ భాయ్‌ అంటూ పాటకి ట్యూన్‌ కడతారు దేవీ.

ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను ప్రముఖ కథానాయకుడు మహేష్‌ బాబు నవంబరు 11న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నాయి.

ఇదీ చదవండి:హనీమూన్​లో కాజల్ అగర్వాల్ జోడీ

ABOUT THE AUTHOR

...view details