తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రంగస్థలం' తమిళ​ ట్రైలర్ వచ్చేసింది - రామ్ చరణ్ రంగస్థలం తమిళ ట్రైలర్

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రంగస్థలం'. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా ఇప్పుడు తమిళంలో విడుదలయేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్​ను విడుదల చేశారు.

Rangasthalam
రంగస్థలం

By

Published : Apr 21, 2021, 8:36 PM IST

మెగా పవర్​స్టార్ రామ్‌ చరణ్‌, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'. సుకుమార్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా తమిళ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. 'రంగస్థలం' తమిళ డబ్బింగ్‌ వెర్షన్‌ ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ విడుదలైంది.

పవర్‌ఫుల్‌ డైలాగులు, నేపథ్య సంగీతంతో సందడి చేస్తోందీ ట్రైలర్‌. ఈ సినిమాను తమిళనాడులో 300లకు పైగా స్ర్కీన్లలో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తోంది డిస్ట్రిబ్యూషన్‌, నిర్మాణ సంస్థ 7జీ ఫిల్మ్స్‌. తెలుగునాట ఈ చిత్రం 2018 మార్చి 30న విడుదలై ఘన విజయం అందుకుంది.

ABOUT THE AUTHOR

...view details