తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రంగమ్మ మంగమ్మ' యూట్యూబ్​లో రికార్డులమ్మ..! - రంగమ్మ మంగమ్మ

రామ్​చరణ్, సమంత జంటగా నటించిన 'రంగస్థలం' సినిమాలోని 'రంగమ్మ మంగమ్మ' పాట యూట్యూబ్​ను ఊపు ఉపేస్తోంది. సరికొత్త  రికార్డులు సృష్టిస్తోంది.

రంగమ్మ మంగమ్మ

By

Published : Oct 20, 2019, 7:04 PM IST

గతేడాది విడుదలైన 'రంగస్థలం' చిత్రంలోని 'రంగమ్మ మంగమ్మ' పాటను సంగీత ప్రియులు అంత త్వరగా మర్చిపోలేరు. ఎందుకంటే అంతలా అందరిని అలరించింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ పాటకు ఆకర్షితులయ్యారు. ఇప్పుడీ గీతాన్ని యూట్యూబ్‌లో 200 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.

ఆ పాట సందర్భం..!

రామలక్ష్మి.. చిట్టిబాబును ప్రేమిస్తుంది. చిట్టిబాబుకేమో వినికిడి లోపం. లక్ష్మికి ఏం జరిగినా పట్టించుకోడు పాపం. అందుకే తన బాధను పాట రూపంలో ఇరుగుపొరుగు వారికి తెలియజేస్తుంది. ‘'రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు' అంటూ వారి మధ్య జరిగిన వాటిని వివరిస్తుంది.

పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. సుకుమార్‌ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

ఇదీ చూడండి : స్టాండింగ్ ఒవేషన్​తో బాహుబలి బృందానికి గౌరవం

ABOUT THE AUTHOR

...view details