పెళ్లిరోజు కూడా హీరో నితిన్‌కు తిప్పలు తప్పలేదు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ కార్యక్రమం.. ఈరోజు(జులై 26) జరగనుంది. తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ శాలినిని వివాహం చేసుకోనున్నారు నితిన్. అయితే అతడిని ఇప్పుడూ ప్రశాంతంగా ఉంచకుండా డబ్బింగ్ చెప్పించింది 'రంగ్‌దే' చిత్రబృందం. ఆ వీడియోను దర్శకుడు వెంకీ అట్లూరి ట్వీట్ చేశారు.
పెళ్లిరోజున హీరో నితిన్‌కు తప్పని ఇబ్బందులు! - nithiin rangde
పెళ్లి రోజున ఎంజాయ్ చేయనీయకుండా తనను 'టార్చర్' చేస్తున్నారని హీరో నితిన్ అన్నాడు. ఇంతకీ ఏం జరిగింది?

తమ కథానాయకుడు నితిన్‌కు పెళ్లి కానుకగా ఓ ప్రత్యేక బహుమతి ఇవ్వాలని 'రంగ్‌దే' యూనిట్ ప్లాన్ చేసింది. పెళ్లి పనుల్లో బిజీగా అతడు బిజీగా ఉండటం వల్ల అతడుంటున్న చోటుకే చేరుకుని అక్కడే డబ్బింగ్ చెప్పించారు. ఈ వీడియో చివర్లో మాట్లాడిన నితిన్.. తనను పెళ్లిరోజు కూడా ఎంజాయ్ చేయనీయకుండా 'టార్చర్' చేస్తున్నారని(నవ్వుతూ) అన్నారు.
ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరిగింది. కరోనాతో గత కొన్ని నెలలుగా అది నిలిచిపోయింది.