నితిన్-కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'రంగ్‌దే'. వెంకీ అట్లూరి దర్శకుడు. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. "నా కళ్లలో కొత్త నీలి రంగు పొంగెనే... అవి నిన్ను చూసినప్పుడే...నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనె" అంటూ సాగిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా శ్వేతా మోహన్ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది.
'రంగ్ దే','జాతిరత్నాలు' సాంగ్స్-'సుల్తాన్' అప్డేట్ - jatiratnalu song making video
నితిన్ 'రంగ్ దే' సినిమా, 'జాతిరత్నాలు'లోని వీడియో సాంగ్స్ విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటే మరిన్ని చిత్ర విశేషాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
సుల్తాన్
తమిళ హీరో కార్తి నటించిన 'సుల్తాన్' సినిమా ట్రైలర్ మార్చి 24న సాయంత్రం 5గంటలకు విడుదల కానుంది. ఇందులో రష్మిక హీరోయిన్. భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. ఈ వేసవిలో థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు.
నవ్వులతో థియేటర్లలో సందడి చేస్తున్న 'జాతిరత్నాలు' సినిమాకు సంబంధించిన ఓ వీడియో పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ గీతం వినసొంపుగా ఉంది. ఇందులో కీర్తిసురేశ్, నవీన్‌పోలిశెట్టి మధ్య కెమిస్ట్రీని చూపించారు.
Last Updated : Mar 23, 2021, 6:37 PM IST