నటుడిగా వెండితెరకు పరిచయమై దర్శకుడిగా మారారు వెంకీ అట్లూరి. తొలి ప్రయత్నం ‘తొలి ప్రేమ’తో మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు 'రంగ్ దే'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. నితిన్, కీర్తి సురేశ్ నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రమిది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు వెంకీ.
అందుకే ఆ పేరు..
నాకు ఎప్పటి నుంచో కుటుంబ కథా చిత్రం చేయాలని ఉండేది. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్న' తర్వాత వాటికి భిన్నంగా భావోద్వేగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచన నుంచి పుట్టింది ఈ కథ. పక్కపక్క ఇళ్లలో ఉండే అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సి వస్తే వాళ్ల పరిస్థితి ఏంటనే లైన్ ఆధారంగా తీసుకుని కథ రాసుకున్నాను. పెళ్లి తర్వాత ఎదురయ్యే సమస్యల్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా పరిష్కరించుకుంటారు. మరి ఇందులో ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రం నవ్వులు పంచుతూనే ఎమోషన్‌గా సాగుతుంది. ఒక్కో రంగు ఒక్కో భావోద్వేగాన్ని సూచిస్తుంది. అందుకే ‘రంగ్ దే’ అనే పేరు పెట్టాం. ద్వితీయార్ధంలో సుమారు 40 నిమిషాలు మనసుని హత్తుకునే సన్నివేశాలుంటాయి. అయితే అవి డ్రామాగా కాకుండా చాలా సహజంగా సాగుతూ మనకి కనెక్ట్ అవుతాయి.
పాత్రలకు ప్రాణం పోశారు..
ముందుగా కథానాయకుడి పాత్ర కోసం వేరే వాళ్లని అనుకున్నా. నిర్మాతని కలిశాక నితిన్ పేరు సూచించారు. నాయిక పాత్ర కోసం పక్కింటి అమ్మాయిలా కనిపించే నటి కావాలనుకున్నాను. అలా కీర్తి సురేశ్ మదిలో మెదిలింది. కథ చెప్పిన వెంటనే ఇద్దరూ ఓకే చేసేశారు. ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఖరారు చేస్తారని నేను అసలు ఊహించలేదు. మరో విషయం ఏంటంటే నా కంటే బాగా వాళ్లే ఈ కథని నమ్మారు. అందుకే అర్జున్, అను పాత్రలకు ప్రాణం పోశారు.
ఇలాంటి అనుభవం ఎదురవలేదు..