తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​లో గాయపడ్డ బాలీవుడ్​ నటుడు.. మోకాలికి శస్త్రచికిత్స - బాలీవుడ్​ న్యూస్​

​ Randeep Hooda: 'ఇన్​స్పెక్టర్ అవినాశ్​' చిత్రీకరణ సమయంలో గాయపడిన నటుడు రణ్​దీప్​ హుడాకు శస్త్రచికిత్స జరిగింది. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం సర్జరీ విజయవంతంగా పూర్తైంది.

Randeep Hooda undergoes knee surger
రణ్​దీప్​ హుడా మోకాలికి శస్త్రచికిత్స

By

Published : Mar 4, 2022, 5:39 PM IST

Randeep Hooda: బాలీవుడ్​ నటుడు రణ్​దీప్​ హుడా మోకాలికి బుధవారం శస్త్రచికిత్స జరిగింది. తన తదుపరి సిరీస్​ 'ఇన్​స్పెక్టర్ అవినాశ్​' చిత్రీకరణ సమయంలో అతడు గాయపడ్డాడు. గతనెలలో ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా గాయమైందని అతడి సన్నిహితుడు తెలిపాడు. ప్రమాదంలో గాయపడ్డ 45ఏళ్ల రణ్​దీప్ మార్చి 1న ముంబయిలోని కోకిలాబెన్​ ధీరుభాయ్​ అంబానీ ఆస్పత్రిలో చేరాడు.

రణ్​దీప్​ హుడా మోకాలికి శస్త్రచికిత్స

"అతడికి బుధవారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. రెండు రోజుల్లో డిశ్చార్జ్​ చేస్తారు. ఇదే మోకాలికి గతంలో 'రాధే' చిత్ర షూటింగ్​ సమయంలో గాయమైతే ఆపరేషన్​ చేశారు."

-రణ్​దీప్​ హుడా సన్నిహితుడు

2019 డిసెంబరులో 'రాధే' చిత్రీకరణ సమయంలో కూడా హుడాకు గాయమైంది. మోకాలు స్థానభ్రంశం కావడం వల్ల ఆసుపత్రికి తరలించారు. బాలీవుడ్​ స్టార్​ సల్మాన్ ఖాన్​ హీరోగా నటించిన ఈ చిత్రంలో యాక్షన్​ సన్నివేశాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

'ఇన్​స్పెక్టర్ అవినాశ్​' చిత్రం యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన నేర కార్యకలపాలకు సంబంధించిన పోలీసు కథ నేపథ్యంగా వస్తుంది. నెట్​ఫ్లిక్స్​లో వస్తున్న రివేంజ్​ డ్రామా 'క్యాట్' సిరీస్​లోనూ రణ్​దీప్​ కనపడనున్నాడు.

ఇదీ చదవండి:Prabhas: 'బాహుబలి పార్ట్​ 3 ఉండొచ్చు.. వాళ్లు వదిలిపెట్టరు'

ABOUT THE AUTHOR

...view details