బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతిపై బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలువచ్చాయి. ఓ హిందీ ఛానల్లో ప్రసారమవుతోన్న కామెడీ షోలో పాల్గొన్న రణ్‌దీప్.. మాయవతిపై అవమానకరంగా మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఆగ్రహిస్తూ.. సదరు నటుడ్ని అరెస్టు చేయాలని ట్విట్టర్లో ట్రెండ్ చేశారు.
మాయవతిపై జోక్.. చిక్కుల్లో బాలీవుడ్ నటుడు! - మాయవతిపై రణ్‌దీప్ హుడా జోక్
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హూడాను అరెస్టు చేయాలంటూ సోషల్‌మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయన.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మాయవతిపై జోక్.. చిక్కుల్లో బాలీవుడ్ నటుడు!
ఈ సంఘటనతో పర్యావరణ వలస జాతుల ప్రచారకర్తగా ఉన్న రణ్‌దీప్‌ను ఐక్యరాజ్య సమితి తొలగించింది. రణ్‌దీప్ హూడా.. చివరిగా సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన 'రాధే' సినిమాలో కనిపించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది.
ఇదీ చూడండి:Sonu Sood ఫౌండేషన్.. ఇచ్చట ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉచితం!
Last Updated : May 28, 2021, 10:51 PM IST