బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా తనను మోసం చేశారని ఓ మహిళా స్క్రిప్ట్ రైటర్ ఆరోపించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కమీషనర్‌కు ఈ విషయమై మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన ఈమె.. రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని రణ్‌దీప్‌కు లీగల్ నోటీస్ కూడా పంపింది!
ఇంతకీ ఏం జరిగింది?
హరియాణా హిసర్ జిల్లాకు చెందిన కథ, పాటల రచయిత ప్రియాంక శర్మ.. ప్రముఖ నటుడు రణ్‌దీప్ హుడాను సోషల్ మీడియా ద్వారా కలిసింది. తన దగ్గర కథలు అతడికి వినిపించగా.. కలిసి పనిచేద్దామని రణ్‌దీప్ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో 1200 పాటలు, 40 కథలను అతడితో పాటు ఆశ హుడా, మన్దీప్ హుడా, అజ్లీ హుడా, మనీశ్, రణ్‌దీప్ మేనేజర్ పంచాలీ చౌదరి, మేకప్ ఆర్టిస్ట్ రేణుక పిల్లైలకు మెయిల్, వాట్సాప్ ద్వారా పంపినట్లు ప్రియాంక పేర్కొంది.