తెలంగాణ

telangana

ETV Bharat / sitara

1484 రోజుల తర్వాత రణ్​బీర్​.. సాంగ్​ ప్రోమోతో మహేశ్​ - గుడ్​లక్​సఖి ఓటీటీ రిలీజ్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో రణ్​బీర్​కపూర్​, శ్రీవిష్ణు, వైష్ణవ్​తేజ్​, కీర్తిసురేశ్​ సహా పలు హీరోలు నటించిన చిత్రాల వివరాలు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​

By

Published : Feb 11, 2022, 5:00 PM IST

Updated : Feb 11, 2022, 5:41 PM IST

Ranbirkapoor shamshera movie: నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరో వెండితెరపై కనిపించనున్నాడు. 'సావరియా'తో ఎంట్రీ ఇచ్చి.. 'రాక్‌స్టార్‌', 'యే జవానీ హై దివానీ' తదితర చిత్రాలతో స్టార్‌ హీరోగా ఎదిగిన రణ్‌బీర్‌ కపూర్​ చివరిగా 2018లో వచ్చిన సంజయ్‌ దత్‌ బయోపిక్‌ 'సంజూ'లో కనిపించారు. ఇప్పుడాయన 'షంషేరా' అనే పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా చిత్రంతో పలకరించనున్నారు. 1484 రోజుల థియేటర్లో రణ్‌బీర్‌ దర్శనమివ్వడం విశేషం. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. 2022 జులై 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. వాణీ కపూర్‌, సంజయ్‌ దత్‌ కీలక పాత్రలు పోషించారు. కాగా, ఇదే ఏడాది పాన్‌ ఇండియా చిత్రం 'బ్రహ్మస్త'తో రణ్‌బీర్‌ సందడి చేయనున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. ఆలియా భట్‌, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్‌ కీలక పాత్రలు పోషించారు.

ఫస్ట్ సింగిల్​

మహేశ్‌బాబు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సర్కారు వారి పాట' తొలి గీతం అతి త్వరలోనే అలరించనుంది. ప్రేమికురోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ పాటను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రోమో రూపంలో సినీ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 'వందో.. ఒక వెయ్యో' అంటూ సాగే ఈ మెలొడీ అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. అనంత శ్రీరామ్‌ రచించిన ఈ గీతాన్ని సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. తమన్‌ స్వరాలందించారు. ఈ యాక్షన్‌- కామెడీ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటిస్తోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం మే 12న విడుదలకానుంది.

సాంగ్​ ప్రోమో

Srivishnu Bhala tandana movie: శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'భళా తందనాన'. ఈ చిత్రంలోని రాశానీలా సాంగ్​ ప్రోమోను రిలీజ్​ చేశారు. కేథరిన్ హీరోయిన్​. మణిశర్మ సంగీతమందించారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు.

రిలీజ్​ డేట్​

Rangaranga vaibhavanga: మెగాహీరో వైష్ణవ్​తేజ్​ నటించిన 'రంగరంగ వైభవంగ' చిత్రం రిలీజ్​ డేట్​ ఖరారు చేసుకంది. మే 27 థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. గిరీశాయా దర్శకత్వం వహించిన ఈ మూవీకీ దేవీశ్రీ సంగీతం అందించారు. కేతికశర్మ హీరోయిన్​గా నటించింది.

టీజర్​

Udaystalin new movie: తమిళ హీరో ఉదయ్​స్టాలిన్​ నటించిన నెన్​జుక్కు నీది(NenjukkuNeedhi) సినిమా టీజర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. అర్జున్​రాజా కామారాజ్​ దర్శకత్వం వహించారు.

ఓటీటీలో 'ఎనిమి'

Enemy OTT Release date: విశాల్‌, ఆర్య హీరోలుగా కలిసి నటించిన చిత్రం 'ఎనిమి'. గతేడాది నవంబరులో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతుంది. సోనీ లివ్‌లో ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ప్రాణానికి ప్రాణంగా ఉండే ఇద్దరు స్నేహితులు శత్రువులుగా ఎందుకు మారాల్సి వచ్చింది? అనే ఆసక్తికర పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళిని రవి కథానాయిక. మమతా మోహన్‌దాస్‌, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్​ స్వరాలు సమకూర్చారు.

ఓటీటీలో 'గుడ్​లక్​ సఖి'

Goodluck Sakhi ott release: కీర్తిసురేశ్​, ఆదిపినిశెట్టి, జగపతిబాబు నటించిన గుడ్​లక్​ సఖి ఇటీవలే థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్​ ప్రైమ్​లో ఫిబ్రవరి 12నుంచి స్ట్రీమింగ్​ కానుంది. ఈ మూవీకి నగేష్​ కుమార్​ దర్శకత్వం వహించారు.

ఇదీ చూడండి:Khiladi review: 'ఖిలాడి'తో రవితేజ మళ్లీ హిట్​ కొట్టినట్టేనా?

Last Updated : Feb 11, 2022, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details