తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రణ్​బీర్-శ్రద్ధా మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - హోలీ కానుకంగా రణ్​బీర్ లవ్ రంజన్ చిత్రం

బాలీవుడ్ హీరో రణ్​బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జోడీగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. లవ్ రంజన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్​ను తాజాగా వెల్లడించింది చిత్రబృందం.

Ranbir-Shraddha's nex
రణ్​బీర్-శ్రద్ధా మూవీ

By

Published : Feb 19, 2021, 4:17 PM IST

బాలీవుడ్‌లో ఇప్పుడు కొత్తకొత్త కాంబినేషన్లు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం లవ్‌ ఫిల్మ్‌ సంస్థ రణ్‌బీర్‌ కపూర్, శ్రద్ధా కపూర్​లతో ఓ కొత్త చిత్రం చేస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు నిర్మాతలుగా లవ్‌ రంజన్, అంకుర్‌ గార్గ్‌లు వ్యవహరించనున్నారు. లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం.

ఈ సినిమాను హోలీ కానుకగా మార్చి 22, 2022న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది చిత్రబృందం . రణ్‌బీర్‌ కపూర్, శ్రద్ధా కపూర్‌లు కలిసి నటిస్తోన్న తొలి సినిమా ఇదే. ప్రస్తుతం రణ్‌బీర్‌.. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో 'బ్రహ్మాస్త్ర'తో పాటు సందీప్ రెడ్డి వంగాతో 'ఎనిమల్' చిత్రం చేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details