తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​ జోరు.. 12 సినిమాల రిలీజ్​ డేట్స్​​ ఫిక్స్​ - bhool bhulaiyaa release date

చిత్రీకరణలు పూర్తిచేసుకున్నా ఎన్నో నెలలుగా విడుదల నోచుకుని పలు బాలీవుడ్​ చిత్రాలు రిలీజ్​ డేట్​లను ఖరారు చేసుకున్నాయి. అందులో స్టార్​ హీరోల చిత్రాలు ఉన్నాయి. అవేంటంటే...

cinema
సినిమా అప్డేట్స్

By

Published : Sep 26, 2021, 8:32 PM IST

కరోనా, లాక్​డౌన్​ వల్ల థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకోని నేపథ్యంలో ఎన్నో బాలీవుడ్​ సినిమాలు చిత్రీకరణలు పూర్తిచేసుకున్నా రిలీజ్​కు నోచుకోలేకపోయాయి. ఆలస్యమైనా సినిమాహాళ్ల కోసం ఎదురూచూశాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు తిరిగి మాములు స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో బాలీవుడ్​కు కీలకమైన మహారాష్ట్రలో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకునేందుకు వచ్చే నెల(అక్టోబర్​ 22) నుంచి అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో పలువురు బాలీవుడ్​ స్టార్​ హీరోల​ సినిమాలు వరుసగా రిలీజ్​ డేట్​లను ఖరారు చేసుకున్నాయి. ఈ ఒక్క రోజే దాదాపు పదికి పైగా చిత్రాల విడుదల తేదీలు వచ్చాయి. అవేంటంటే..

యశ్​రాజ్​ ఫిల్మ్స్​ నిర్మించిన చిత్రాలు

సైఫ్​అలీఖాన్​ 'బంటి ఔర్​ బబ్లీ 2'- నవంబరు 19, 2021

అక్షయ్​కుమార్​ 'పృథ్వీరాజ్​'- జనవరి 21, 2022

రణ్​వీర్​ సింగ్​ 'జయేష్​ భాయ్​ జోర్దార్'- ఫిబ్రవరి 25, 2022​

రణ్​బీర్​ కపూర్​ 'షంషీరా'- మార్చి 18, 2022

నడియద్​​వాలా గ్రాండ్​సన్​ ఎంటర్​టైన్​మెంట్​(Nadiadwala Grandson ) తెరెకెక్కించిన చిత్రాలు

'తడప్'-​ డిసెంబరు 3,2021

రణ్​వీర్​ సింగ్​ '83'- డిసెంబరు 25, 2021​

అక్షయ్​కుమార్​ 'బచ్చన్​ పాండే'- మార్చి 4,2022

టైగర్​ ష్రాఫ్​ 'హీరోపంతి 2'- మే 6, 2022

మిగతా ప్రొడక్షన్​ హౌస్​లు రూపొందించిన సినిమాలు

ఆమిర్​ ఖాన్​ 'లాల్​సింగ్​ చద్ధా'- ఫిబ్రవరి 14, 2022

షాహిద్​కపూర్​ 'జెర్సీ'- డిసెంబరు 31, 2021

కార్తిక్​ఆర్యన్​ 'భూల్​ భులయ్యా 2'- మార్చి 25 2022

అజయ్​ దేవగణ్​ 'మేడే'- ఏప్రిల్​ 29, 2022

ఇదీ చూడండి: రూ.400 కోట్ల డీల్​కు స్టార్​ ప్రొడ్యూసర్​ నో- థియేటర్​పైనే ఆశలు

ABOUT THE AUTHOR

...view details