తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ సమయంలో నన్ను రణ్​బీర్​ ఆదుకున్నాడు' - alia bhatt,ranbir kapoor,kalank movie box office

బాలీవుడ్​ సినిమా 'కళంక్'​ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపర్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇందులో నటించిన ఆలియా ఆ సినిమా ఫలితాన్ని చూసి డిప్రెషన్​లోకి వెళ్లిపోయిందట. అప్పుడు రణ్​బీర్​ మద్దతుతోనే కోలుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

'ఆ సమయంలో నన్ను రణబీర్​ ఆదుకున్నాడు'

By

Published : Oct 15, 2019, 8:24 PM IST

Updated : Oct 16, 2019, 3:50 AM IST

బాలీవుడ్​ ముద్దుగుమ్మ ఆలియా భట్, నటుడు రణ్​బీర్​ కపూర్​ ప్రేమలో ఉన్నట్లు ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆలియా.. ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది.

ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కళంక్​'. బాలీవుడ్​లో స్టార్​ నటీనటులు వరుణ్​ ధావన్​, సంజయ్​ దత్​, మాధురీ దీక్షిత్​, సోనాక్షి సిన్హా వంటి భారీ తారాగణం ఇందులో కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. 100 కోట్ల బడ్జెట్​తో రూపొందించిన ఈ మూవీపెద్దగా రాణించలేదు. బాక్సాఫీస్ వద్ద కూడా అనుకున్నంత కలెక్షన్లు ​రాబట్టలేకపోయింది. ఆ సినిమా ఫలితంతో ఆలియా డిప్రెషన్​లోకి వెళ్లిపోయిందట. అప్పుడు రణ్​బీర్​ మద్దతుతోనే బయటపడగలిగినట్లు చెప్పింది.

ఆలియా, రణబీర్​ జోడీ

"నువ్వు ఇవ్వగలిగినంత బెస్ట్​ నువ్వు ఇచ్చావు. సక్సెస్ వచ్చినా రాకపోయినా యాక్టర్​గా నీ కష్టం వృథా కాదు. మరో సినిమా రూపంలో ఆ ఫలితం తిరిగి వస్తుంది" అని రణ్​బీర్​ తనలో ఆత్మస్థైర్యం నింపినట్లు గుర్తు చేసుకుంది ఆలియా.

ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో ఆలియా భట్‌, రణ్​బీర్‌ కపూర్‌ కలిసి నటిస్తున్నారు. ఈ భామ తెలుగులో తెరకెక్కుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలోనూ కనపించనుంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా సందడి చేయనుంది.

Last Updated : Oct 16, 2019, 3:50 AM IST

ABOUT THE AUTHOR

...view details