బాలీవుడ్‌లో ఇప్పుడు కొత్తకొత్త కాంబినేషన్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా లవ్ ఫిల్మ్ సంస్థ రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్లతో ఓ కొత్త చిత్రం చేయనున్నట్లు తెలిపింది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు నిర్మాతలుగా లవ్ రంజన్, అంకుర్ గార్గ్‌లు వ్యవహరించనున్నారు.
రణ్‌బీర్ - శ్రద్ధల చిత్రం వచ్చేది అప్పుడే - లవ్ రంజన్
ఇప్పటివరకు తెరపై కనిపించని కొత్త జోడీ ఓ చిత్రం చేసేందుకు అంగీకరించింది. వారెవరో కాదు బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్. వీరిద్దరూ కలిసి లవ్ ఫిల్మ్ సంస్థలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రణ్‌బీర్
ఈ చిత్రాన్ని మార్చి 26, 2021 నాటికి తెరపైకి తీసుకురానున్నారు. రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్‌లు కలిసి నటిస్తోన్న తొలి సినిమా ఇదే. ప్రస్తుతం రణ్‌బీర్.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'బ్రహ్మాస్త్ర'లో నటిస్తున్నాడు. ఇందులో ఆలియా భట్, అమితాబ్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రద్ధాకపూర్ 'స్ట్రీట్ డ్యాన్సర్ 3', టైగర్ ష్రాఫ్‌తో కలిసి 'బాఘి 3'లో చేస్తుంది.
ఇవీ చూడండి.. టాలీవుడ్ 'మన్మథుడు'కి పదిహేడేళ్లు