బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, అలియాభట్ ప్రేమ ప్రయాణం కొనసాగుతోంది.తాజాగా వీరు గోవాకు వెళ్లిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ప్రేమ పావురాలు సోమవారం గోవాకు అత్యవసరంగా ఎందుకెళ్లాయో తెలుసా? ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకట.
రణ్‌బీర్-అలియా గోవా ఎందుకెళ్లారు?
బాలీవుడ్ క్యూట్ లవ్ కపుల్ రణ్‌బీర్, అలియా ఈ మధ్య గోవా వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే ఈ ప్రేమ పావురాలు గోవాకు అత్యవసరంగా ఎందుకు వెళ్లాయో ఇప్పుడు తెలిసిపోయింది.
ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్‌లో ముంబయి జట్టుకు రణ్‌బీర్ కపూర్ సహయజమానిగా వ్యహరిస్తున్నాడు. సోమవారం గోవాలో జంషెడ్‌పూర్ జట్టుతో ముంబయి సిటీ జట్టుకు ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. దీనిని వీక్షించేందుకు ఈ ఇద్దరూ అక్కడి వెళ్లారట. దీనికి సంబంధించిన ఫొటోలను ముంబయి సిటీ జట్టు అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది.
2018లో సోనమ్ కపూర్- ఆనంద్ ఆహుజా పెళ్లి వేడుకలో ఇద్దరూ కలిసి పాల్గొనడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అప్పట్లో వార్తలొచ్చాయి. తాజాగా అయాన్ ముఖర్జీ నిర్మిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో వీరిద్దరూ కలిసి తెరను పంచుకోనున్నారు. ఈ చిత్రంలో స్టార్ కథానాయకులు అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.