బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్(ranbir alia bhatt marriage) ఈ ఏడాది కూడా పెళ్లి చేసుకునే సూచనలు కనపడట్లేదు. వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబరులో వివాహం చేసుకుంటారని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడా వేడుక వాయిదా పడినట్లు తెలిసింది. రణ్‌బీర్-ఆలియా తమ వెడ్డింగ్ ప్లాన్‌ను మార్చుకున్నారట. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీటౌన్ మీడియాలో వార్తలొస్తున్నాయి. షూటింగ్‌ల్లో బిజీగా ఉండటమే కారణమని తెలిసింది. వీరిద్దరూ తమ పెళ్లిని కోహ్లీ-అనుష్క తరహాలోనే ఇటలీలో చేసుకుంటారని సమాచారం.
లవ్‌బర్డ్స్ రణ్‌బీర్-ఆలియా పెళ్లి ఇప్పట్లో లేనట్టేనా? - ranbir aliabhatt wedding postpone
బాలీవుడ్ ప్రేమజంట రణ్‌బీర్-ఆలియా భట్(ranbir alia bhatt marriage) ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడా వివాహ వేడుకను వచ్చే ఏడాదికి వాయిదా వేశారని తెలిసింది.
ఆలియా-రణ్‌బీర్
దాదాపు మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు రణ్‌బీర్-ఆలియా(ranbir kapoor alia bhatt). ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'బ్రహ్మస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఆలియా(Aliabhatt RRR movie).. 'ఆర్ఆర్ఆర్', 'గంగూబాయ్ కతియావాడి' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటే 'డార్లింగ్స్', 'రాకీ ఔర్ రానీ కీ ప్రేమ్ కహానీ'లో నటిస్తోంది. కాగా, రణ్‌బీర్.. 'షంషేరా' సహా మరో చిత్రంలో నటిస్తున్నాడు.
ఇదీ చూడండి: అగరబత్తీల వ్యాపారంలోకి ఆలియా భట్