బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కలిసి సరదాగా గడిపేందుకు గోవాకు బయలుదేరారు. కొత్త సంవత్సర వేడుకల్ని కూడా అక్కడే జరుపుకొంటారని తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం వీరిద్దరు ముంబయి విమానాశ్రయంలో కనువిందు చేశారు. స్టైలిష్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
గోవా షికారుకు బాలీవుడ్ లవ్ బర్డ్స్
కొత్త సంవత్సర వేడుకలు సరదాగా జరుపుకొనేందుకు బీటౌన్ ప్రేమజంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ముందస్తుగానే గోవాకు వెళ్లారు. వీరిద్దరు సోమవారం ముంబయి విమానాశ్రయంలో స్టైలిష్ లుక్‌లో కెమెరాల కంటికి చిక్కారు.
లాక్డౌన్ తర్వాత చిత్రీకరణలు పునఃప్రారంభమవ్వగానే రణ్‌బీర్-ఆలియా.. తమ తమ సినిమాలతో బిజీ అయిపోయారు. ఓ వైపు ఆలియా 'గంగూబాయ్', 'ఆర్ఆర్ఆర్', 'బ్రహ్మస్త్ర' ఇలా వరుస సినిమాల షూటింగ్లలో పాల్గొనగా.. చాక్లెట్ బాయ్ కూడా 'బ్రహ్మస్త్ర', 'లవ్ రంజన్'(ఇటీవల ప్రకటించారు) చిత్రాల కోసం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే వృతిపరమైన జీవితానికి కాస్త విరామం ఇచ్చి ఉల్లాసంగా గడపడానికి ఈ ప్రేమజంట గోవాకు పయనమైంది.
ఇదీ చూడండి : బాలీవుడ్ లవర్‌బాయ్.. రణ్‌బీర్ కపూర్