తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మనిషిని నమ్మాలంటే ధైర్యం ఉండాలి' - tollywood

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'రణరంగం'. ఈ సినిమా టీజర్ విడుదలైంది.

రణరంగం

By

Published : Jun 29, 2019, 4:58 PM IST

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రణరంగం'. ఈ సినిమాలో శర్వా గ్యాంగ్​స్టర్​గా కనిపించనున్నాడు. ఇటీవలే శర్వానంద్ షూటింగ్​లో గాయపడగా కొద్దిరోజులు చిత్రీకరణకు విరామం ప్రకటించింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది.

"దేవుణ్ని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోద్ది.. కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం ఉండాలి" అంటూ సాగే డైలాగ్​తో టీజర్ ప్రారంభమైంది. ఓ యువకుడు గ్యాంగ్​స్టర్​గా ఎలా ఎదిగాడన్న కథాంశంతో సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది.

కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంగీతం ప్రశాంత్ పిళ్ళై అందిస్తుండగా.. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్​పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు.

ఇవీ చూడండి.. వెంకటేశ్ నుంచి ఫోన్... హీరో షాక్

ABOUT THE AUTHOR

...view details