తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ సినిమా ట్రైలర్​లో మాటల్లేవు..!

'రణరంగం' సౌండ్​ కట్ ట్రైలర్​ను టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్​చరణ్ విడుదల చేశాడు. ఈ సినిమాలో గ్యాంగ్​స్టర్ పాత్రలో కనిపించనున్నాడు శర్వానంద్.

ఈ సినిమా ట్రైలర్​లో మాటల్లేవు..!

By

Published : Aug 11, 2019, 5:59 PM IST

Updated : Sep 26, 2019, 4:17 PM IST

శర్వానంద్ హీరోగా నటించిన 'రణరంగం' చిత్రబృందం వినూత్నంగా ఆలోచించింది. ఇప్పటికే ట్రైలర్​ను విడుదల చేసినా.. ఇప్పుడు మాటల్లేకుండా కేవలం శబ్దాలున్న 'సౌండ్​ కట్ ట్రైలర్​'ను ప్రేక్షకులకు ముందుకు తెచ్చింది. ఇది విభిన్నంగా ఉంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

గ్యాంగ్​స్టర్​ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు శర్వా. వైజాగ్​లోనే ఎక్కువ భాగం చిత్రీకరణ జరిగింది. కల్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ప్రశాంత్ పిల్లై సంగీతమందించాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా.

ఇది చదవండి: 'ప్రేమించా.. మోసపోయా.. పుస్తకం రాశా' అంటున్న నటి ఆండ్రియా

Last Updated : Sep 26, 2019, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details