తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆగస్టు 15న రణరంగం సృష్టించనున్న శర్వా - kajal

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని నటిస్తున్న చిత్రం 'రణరంగం'. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. సుధీర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

రణరంగం

By

Published : Jul 17, 2019, 11:49 AM IST

శర్వానంద్ నటిస్తున్న కొత్త సినిమా 'రణరంగం'. కాజల్, కళ్యాణి ప్రియదర్శిని నటిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

కాజల్ - శర్వానంద్​

ఇందులో శర్వానంద్ గ్యాంగ్​స్టర్​గా కనిపించనున్నాడు. 1990 - 2000 మధ్య కాలంలో కథ ఉంటుందని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.

ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్​తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్జున్ - కార్తీక్ సంగీతం సమకూరుస్తున్న సితార ఎంటర్​టైన్మెంట్స్ బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇది చదవండి: 32 ఎమ్మీ నామినేషన్లతో గేమ్ ఆఫ్​ థ్రోన్స్​ రికార్డు

ABOUT THE AUTHOR

...view details