తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రణరంగం... రివ్యూలకు పూర్తిగా అతీతం...!' - sarwanand

రణరంగం చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని కేంద్రాల్లోనూ తొలిరోజే విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడింది.

రణరంగం

By

Published : Aug 16, 2019, 9:53 AM IST

Updated : Sep 27, 2019, 4:04 AM IST

హైదరాబాద్​లో రణరంగం చిత్రబృందం సందడి

శర్వానంద్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం రణరంగం. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంపై హర్షం వ్యక్తం చేసింది చిత్ర బృందం. హైదరాబాద్​ ఫిల్మ్​నగర్​ కార్యాలయంలో​ బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంది.

రణరంగంపై తమ అంచనాలు నిజం చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు హీరో శర్వా.

సితార ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్​పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ ముఖ్య పాత్రలో నటించింది.

ఇది చదవండి: శంకర్ సినిమా నుంచి తప్పుకోలేదు: కాజల్

Last Updated : Sep 27, 2019, 4:04 AM IST

ABOUT THE AUTHOR

...view details