టాలీవుడ్ భళ్లాలదేవుడు రానా.. చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నాడు. వచ్చే నెల 1 నుంచి 'విరాటపర్వం' చిత్రీకరణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్కు హాజరైన రానా... అనారోగ్య కారణాల వల్ల దూరమయ్యాడు. చికిత్స కోసం లండన్ వెళ్లి 5 నెలలపాటు అక్కడే ఉన్నాడు. ఈలోగా దర్శకుడు వేణు... హీరోయిన్ సాయిపల్లవికి సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేశాడు. నక్సల్స్ నేపథ్య కథాంశంతో తెరకెక్కుతోందీ చిత్రం.