తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విక్టరీ క్లాప్​తో రానా 'విరాటపర్వం' మొదలు - SaiPallavi

'బాహుబలి' సిరీస్​లో ప్రతినాయకుడిగా నటించి... విమర్శకుల మన్ననలు పొందిన యంగ్​ హీరో రానా తదుపరి చిత్రం ప్రారంభమైంది. సాయి పల్లవితో కలిసి రొమాన్స్​ చేయనున్న 'విరాటపర్వం' చిత్రీకరణ హైదరాబాద్​లోని రామానాయుడు స్టూడియోస్​లో ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది.

రానా 'విరాటపర్వం' మొదలైంది

By

Published : Jun 15, 2019, 1:31 PM IST

టాలీవుడ్​ యువ కథానాయకుడు రానా దగ్గుబాటి తదుపరి చిత్రం 'విరాటపర్వం' పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. రానా సరసనహీరోయిన్​గా​ సాయి పల్లవి నటించనుంది.ఈ రోజు ఉదయం హైదరాబాద్​లోని రామానాయుడు స్టూడియోస్​లో చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. టాలీవుడ్​ అగ్రహీరో విక్టరీ వెంకటేశ్​ ముహూర్త వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. హీరో హీరోయిన్లపై క్లాప్​ కొట్టి షూటింగ్​కు పచ్చజెండా ఊపారు వెంకీ. గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ ఆన్​ చేశాడు.

ఈ చిత్రానికి 'నీదీ నాదీ ఒకటే కథ' ఫేమ్​ వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్​ ప్రొడక్షన్స్​, ఎస్​ఎస్​వీ సినిమాస్​​ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి... సురేశ్​ప్రభు, సుధాకర్​ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ​

ఇదీ చూడండి : సాహోలో ఒక్క ఛేజ్​ సీన్​ కోసం 90 కోట్లు..!

ABOUT THE AUTHOR

...view details